రమాకాంత్ దేశాయ్(Ramakant Desai)-eastmedia

ఏప్రిల్ 28
భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్
రమాకాంత్ దేశాయ్ గారి వర్థంతి
1939, జూన్ 20న ముంబాయిలో జన్మించిన రమాకాంత్ దేశాయ్ (Ramakant Bhikaji Desai) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1959లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఇతను ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు సేవలందించాడు.వెస్టిండీస్ తో ఆడిన తొలి టెస్టులోనే 49 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టినాడు. 1959లో ఇంగ్లాండు, 1961-62లో వెస్టీండీస్, 1967-68లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లలో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1960-61లో పాకిస్తాన్ పై జరిగిన సీరీస్‌లో 21 వికెట్లు సాధించాడు. ముంబాయి టెస్టులో 10వ నెంబరు బ్యాట్స్‌మెన్‌గా ప్రవేశించి 85 పరుగులు సాధించాడు. ఇది జాతీయ రికార్డు. అంతేకాకుండా 9 వికెట్టుకు నానా జోషితో కలిసి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తరువాత సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టినాడు. 1998, ఏప్రిల్ 28న మరణించినారు.
టెస్ట్ క్రికెట్ గణాంకాలు
రమాకాంత్ దేశాయ్ 28 టెస్టులు ఆడి 37.31 సగటుతో 74 వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను రెండు సార్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 56 పరుగులకు 6 వికెట్లు. బ్యాటింగ్‌లో 13.48 సగటుతో 418 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 85 పరుగులు. ఇదే టెస్టులలో అతని ఏకైక అర్థసెంచరీ.
రంజీ ట్రోఫి
దేశాయ్ రంజీ ట్రోఫిలో ప్రవేశించిన తొలి సంవత్సరమే 7 మ్యాచ్‌లలో 50 వికెట్లు సాధించాడు. ముంబాతి జట్టు తరఫున ఇది ఇప్పటికీ రికార్డుగా కొనసాగుతోంది. 1958-59 నుంచి 1968-69 వరకు 11 సంవత్సరాలు ముంబాతి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
సెలెక్షన్ కమిటీ చైర్మెన్
1996-97లో రమాకాంత్ దేశాయ్ సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా కొనసాగినాడు. చనిపోవడానికి ఒక మాసం ముందే ఆ పదవికి రాజీనామా చేశాడు.
-eastmedia

Comments

Popular posts from this blog

పి. పుల్లయ్య(p pullaiah)- eastmedia

త్యాగరాజు(Tyagaraja)-eastmedia