Posts

Wedding Card Gift

Image
Wedding Card Gift   మీ ఆర్డర్ పై శుభలేఖలు గిఫ్ట్ ఫ్రేమ్ రూపంలో తయారు చేసి ఇవ్వబడును. eastmedia™

Wedding Card Gift

Image
Wedding Card Gift మీ ఆర్డర్ పై శుభలేఖలు గిఫ్ట్ ఫ్రేమ్ రూపంలో తయారు చేసి ఇవ్వబడును. eastmedia™

సంక్రాంతి శుభాకాంక్షలు Happy Pongal

Image
 సంక్రాంతి శుభాకాంక్షలు Facebook

జనవరి నెలలో ముఖ్యమైన రోజులు January events

Image
 జనవరి నెలలో ముఖ్యమైన రోజులు 01-జనవరి - ఇంగ్లీష్ న్యూ ఇయర్ , ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఎస్టాబ్లిష్మెంట్ డే , గ్లోబల్ ఫ్యామిలీ డే , ప్రపంచ శాంతి దినోత్సవం 04 జనవరి - ప్రపంచ బ్రెయిలీ డే 06-జనవరి - ప్రపంచ యుద్ధ అనాధ దినోత్సవం 08-జనవరి - ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే 09-జనవరి - ప్రవాసి భారతీయ దివాస్ ఎన్ఆర్ఐ డే 10-జనవరి - ప్రపంచ నవ్వుల దినోత్సవం , ప్రపంచ హిందీ దినోత్సవం 11 జనవరి - లాల్ బహదూర్ శాస్త్రి మరణ వార్షికోత్సవం 12 జాన్ - జాతీయ యువ దినోత్సవం (స్వామి వివేకానంద్ పుట్టిన రోజు) 13 జనవరి - గురు గోవింద్ సింగ్ జయంతి 14 జనవరి - లోహ్రీ 15 జనవరి - ఆర్మీ డే (ఫీల్డ్ మార్షల్ కె.ఎమ్. కారియప్ప ఈ రోజు 1949 లో బ్రిటిష్ వారి నుండి ఆర్మీ కమాండ్ను చేపట్టారు) , పొంగల్ , మకర సంక్రాంతి 23 జనవరి - నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం 25 జనవరి - అంతర్జాతీయ కస్టమ్స్ డ్యూటీ డే , ఇండియా టూరిజం డే , జాతీయ ఓటర్ల దినోత్సవం 26 జనవరి - గణతంత్ర దినోత్సవం 27 జనవరి - అంతర్జాతీయ హోలోకాస్ట్ డే (అతిపెద్ద నాజీ మరణ శిబిరం , ఆష్విట్జ్- బిర్కెనౌను సోవియట్ దళాలు జనవరి 27 , 1945 న విముక్తి పొందాయి.) , అంతర్జా...

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు(ANNAMAYYA)-eastmedia

Image
మే 9  అన్నమయ్య జయంతి  అ న్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్య...

అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju)-eastmedia

Image
మే 07 అల్లూరి సీతారామరాజు గారి వర్థంతి అల్లూరి సీతారామరాజు బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 07, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. వంశం సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు -- వెంకట కృ...

త్యాగరాజు(Tyagaraja)-eastmedia

Image
మే 4 త్యాగరాజు గారి జయంతి కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు త్యాగరాజు (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. అతను కీర్తనలు శ్రీరాముని పై అతనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి. బాల్యం, విద్యాభ్యాసం త్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రా...